25, ఏప్రిల్ 2017, మంగళవారం

సమస్య - 2347 (కోరి దాగెను విష్ణువు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కోరి దాగెను విష్ణువు కోటరమున"
(లేదా...) 
"కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై"

24, ఏప్రిల్ 2017, సోమవారం

ఆహ్వానము

సమస్య - 2346 (నల్లని మల్లియలతో...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్"
(లేదా...)
"నల్లని మల్లెలన్ గొని ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్"
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2345 (మగనికి బిడ్డ కలిగెనని...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్"
లేదా...
"మగనికి బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా"
ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

22, ఏప్రిల్ 2017, శనివారం

శుభవార్త!

రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స సత్ఫలప్రదమయింది.

  జైశ్రీరామ్.
శ్రీమతి నేదునూరి రాజేశ్వరక్కయ్య.
ఆర్యులారా! మన నేదునూరి రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స  ఫలప్రదమయింది. 
శస్త్ర చికిత్సాలయము నుండి ఇంటికి పంపించినారట. 
ప్రస్తుతం కులాసాగా  ఉన్నారని తెలిసింది. 
అతి త్వరలో మన బ్లాగులను చదువుతూ వారి అమూల్యమైన అభిప్రాయాలతోపాటు 
సూచనలను కూడా ఇవ్వగలరు.
అక్కయ్య ఆరోగ్యం కుదుట పడాలని, వేగంగా క్రోలుకోవాలని 
సహృదయులయిన మీరంతా ఆకాంక్షించారు. 
మీ ఆకాంక్షల సత్ ఫలమే అక్కయ్య పునరారోగ్యవంతులవటం.
మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
అక్కయ్యకు పరిపూర్ణ ఆరోగ్యంతో 
నిండు నూరేళ్ళ జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకొంటూ 
ఆంధ్రామృతం పాఠకుల తరపున అక్కయ్యకు అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
 జైహింద్.
('ఆంధ్రామృతం' బ్లాగునుండి... శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

సమస్య - 2344 (వానలే లేక...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వానలే లేక సస్యముల్ పండె మెండు"
(లేదా...)
"వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్" 

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2343 (పాము కనుపించ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
" పాము కనుపించ గరుడుండు భయము నొందె"
లేదా...
"గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్"
ఈ సమస్యను పంపిన పూసపాటి నాగమణి గారికి ధన్యవాదాలు.

20, ఏప్రిల్ 2017, గురువారం

ఆహ్వానము (అష్టావధానము)


ఆహ్వానము (అష్టావధానము)


చమత్కార పద్యం - 251

సీతా రావణ సంవాద ఝరి
 3 (-క +న)
ఈ శ్లోకంలో ‘క’ ను తీసి వేసి ఆ స్థానంలో ‘న’ ఉంచాలి

సీతే! శ్రీశ్చ వికాశితా ఖలు వధూ కామప్రియాంగస్య మే
దారిద్ర్యం పురి క ర్తితం గుణ గణైః కాలోచితప్రస్థితేః,
హా మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః ప్రియః
పాపాత్మన్! కలయే నసంగత మిదం సర్వం త్వదుక్తం వచః।।
ఉన్నది ఉన్నట్లుగా.....
రావణోక్తి:
సీతే = ఓ సీతా
వధూ కామ ప్రియాంగస్య = స్త్రీలకు మన్మథుని వలె సుందరుడనైన
మే = నాకు
శ్రీః = సంపద
వికాశితా = విప్పారినది
కాలోచిత ప్రస్థితేః = కాలాను గుణ్య ప్రయాణ సన్నాహము గల
మే = నా యొక్క
గుణగణైః = గుణ సమూహములతో
పురి = పట్టణమందు
దారిద్ర్యం కర్తితం = దరిద్రము నరికి వేయబడినది...అని రావణ కృత స్వస్తుతి!
అట్లే
ప్రియః = నీ ప్రియుడు
మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః = మాయావి పరకాంతలందు మనసు నిలుపు వాడు.... అని రామనింద
సీతా ప్రత్యుక్తి...
సర్వం త్వదుక్తం వచః = నీ పలుకంతయు
సంగతం నకలయే = సరియైనదిగా తలచను... అని సమాన్యార్థం
కలయే = క కారము లోపింపగా
నసంగతం = న కారముతో కూడినది అని సంకేతార్థము
క తీసి వేసి న ప్రతిక్షేపించగా
వధూనామ ప్రియాంగస్య = స్త్రీల కప్రియమగు శరీరము గల
మే = నా యొక్క
శ్రీః = సంపద
వినాశితా = నశింపజేయ బడినది!
నాలోచిత ప్రస్థితే = అనాలోచితముగా ప్రయాణము చేయు
మే = నా యొక్క
పురి = పట్టణమందు
దారిద్ర్యం నర్తితం = దరిద్రము నర్తించును
అని రావణ నిందగా మారింది
అట్లే
మాయానర నామితాన్య లలనాంత రంగః = లీలా మానుష విగ్రహుడు,పర స్త్రీలందు మనసు చేర్చని వాడు
ప్రియః = ప్రేమ పాత్రుడు... అని రామ స్తుతిగా పరిణమించింది.

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)