1, అక్టోబర్ 2017, ఆదివారం

చక్ర బంధ సీసములో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రార్థన


సీ.
శ్రీ లక్ష్మి వల్లభ, శ్రీ గోపికాలోల,
          శ్రీ జగత్పాలాయ, శ్రీ నివాస,
శ్రీ వేంకటేశాయ, శ్రీ అమృతాంశాయ,
          శ్రీ వత్సవక్షసే, శ్రీ హరాయ,
శ్రీ శార్ఙ్గ పాణయే, శ్రీ కటిహస్తాయ,
          శ్రీ పద్మనాభాయ, శ్రీధరాయ,
శ్రీ దీనబంధవే, శ్రీ అనేకాత్మనే,
          శ్రీ జగద్వాపినే, శ్రీ వరాయ,
శ్రీ హయగ్రీవాయ, శ్రీ జగదీశ్వరా, 
          శ్రీ పరంజ్యోతిషే, శ్రీ రమేశ,
శ్రీ మధుసూధనా, శ్రీ భక్త వత్సలా, 
          శ్రీ పరబ్రహ్మణే, శ్రీ శుభాంగ,     
శ్రీ యజ్ఞరూపాయ, శ్రీ ఖడ్గధారిణే,
          శ్రీ నిరాభాసాయ, శ్రీ గిరీశ,
శ్రీ వన మాలినే, శ్రీ యాదవేంద్రాయ,
          శ్రీ సురపూజితా, శ్రీ శిరీశ,       
తే. 
నంద నందనా, దశరధ నందన, మధు
సూదన, పశుపాలకుడ, అనాధ రక్ష
కా, దినకర తేజా, సాలగ్రామ హర,  పు
రాణ పురుష,  కాపాడు  పరమ దయాళు.

పద్యము చదువు విధానము - 
1 అన్న చోటునుంచి “శ్రీ లక్ష్మీ వల్లభ” తో మొదలు పెట్టి మధ్యలో ఉన్న  శ్రీ తో కలిపి “ శ్రీ గోపికా లోల" అని చదువు కోవాలి  చివరిగా “శ్రీ శిరీష” తో  ఆపి,   పైన “నంద నందనా” నుంచి చదువుకొని “పరమ దయాళు” వద్ద ముగించాలి.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

10 కామెంట్‌లు:

  1. పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారూ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుని సీస శంఖము చాల అద్భుతముగానున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు శర్మ గారు ఇది చక్ర బంధం ఇవాళ శ్రీవారి చక్ర స్నానం

      తొలగించండి
  2. నమస్కారములు
    సోదరులు శ్రీ పూసపాటి వారి వేంకటేశ్వరుని సీస శంఖము వైభవోపేతము గా నున్నది ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  3. అక్కయ్య నమస్కారము సీస బంధ చక్రము ఇది. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. కవివరా! చక్రబంధము సుదర్శనముగానున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. కృష్ణకుమార్ గారు బంధ కవిత్వములో మీ నైపుణ్యమద్భుతము. దానిపై నాసక్తి ప్రశంసనీయము.
    సంస్కృత పదములు తెనుగున వాడునపు డవసరమైన మార్పులు చేసి వాడవలెను.
    శ్రీ లక్ష్మి వల్లభ, శ్రీ గోపికాలోల, శ్రీ నివాస యిత్యాదులు సంబోధనములు.
    శ్రీ వేంకటేశాయ, శ్రీ అమృతాంశాయ, శ్రీ వత్సవక్షసే, శ్రీ హరాయ, యిత్యాదులు వేంకటేశుని కై (కొఱకు) అను నర్థమున చతుర్థీ విభక్తి తో కూడు కున్నవి. వీటిని తెనుగున శ్రీ వెంకటేశా మొదలగు సంబోధనలు గా మార్చి ప్రయోగించాలి. లేదా మిగిలినవి కూడా చతుర్థీ విభక్తిలోనే ప్రయోగించి తదనుగుణముగా క్రియాపదముతో ముగించాలి. శ్రీ అమృతాంశా యిత్యాదులు విసంధిగా వ్రాయరాదు.
    సాలగ్రామ అన్నప్పుడు ల గురువవుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన సూచన అందించారు కామేశ్వర రావు గారు. ధన్యవాదములు . తప్పులను సరిచూచుకొని సమర్ధవంతము గా ఇంకొక ప్రయత్నము చేస్తాను . సర్వ వేళల యందు ఇట్టి సహకారము నేను మీ వద్ద నుంచి అసిష్టున్నాను. మరొక మారు ధన్య వాదములతో

      తొలగించండి
  6. చక్రబంధంపుసీసమ్ముజదువతెలిసె
    నీదు రచనావిధానమునిక్కముగను
    పండితులకుకాకుండగ బామరులకు
    సులువుగానర్ధమగునది సుమ్ముసూర్య!

    రిప్లయితొలగించండి