19, ఏప్రిల్ 2018, గురువారం

అష్ట నాగ దిగ్బంధ కంద చిత్రమాలిక


శ్రీకర! కపి!  కనుమా యిక,
నీ కారుణ మింక సోక నిమ్ముర కన్నా!
శోకము నాపిక, చక చక 
యీ కయి కష్టమ్ము  నింక,  యిక చేయదుగా !
   
భావము
          ఓ  హరి నీ యొక్క దయ నాపై చూపుము ,  నా శోకము నాపుము లేకున్న  త్వర త్వరగా నా చేయి  యింక కష్ట పడదు.  (చేతులు కష్ట పడితేనే పనులు అవుతాయి.  ప్రాణము లేకున్నా చేతులు కష్ట పడవు. హరి శోకము ఆపి సుఖము ఇవ్వకున్న  ప్రాణము పోవును గా అని భావము.)

          ఈ బంధము చాల  కష్ట తరమైనది.  8  పాములలో  ఒకే పద్యము బంధించపడు కవిత్వము వ్రాయ బడుట విశేషము.   చూడటానికి పద్యము చాల  చిన్నదిగా సరళముగా  అనిపిస్తుంది.    కానీ ఎటు చూసిన పద్యము  ప్రతి పాములో బంధించ  బడుట  విశేషము    నాకు స్పూర్తి నిచ్చిన   శ్రీ సుప్రభ గారికి హృదయ పూర్వక ప్రణామములు.
బంధకవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి